About

ప్రకామ్య కు స్వాగతం ప్రకామ్య అంటే కోరింది నెరవేర్చుకోవడం.సినిమా తీయాలనే మీ కలలు నెరవేర్చుకోడానికి సాధనం ఈ ప్రకామ్య. మీలాగే సినిమాలంటే ఆసక్తి కలిగిన వారిని ఇక్కడ కలుసుకోవచ్చు. సినిమా అనే ప్రక్రియలోని వివిధ అంశాలను ఇక్కడ చర్చించుకోవచ్చు. ప్రకామ్యలో సభ్యునిగా చేరండి. మీ కలలు నిజం చేసుకోండి.

ప్రకామ్యలో మీరు ఏం చెయ్యవచ్చు?

ప్రకామ్యలో మిగిలిన సోషల్ నెట్ వర్కింగ్ సైట్లలో ఉన్న అన్ని సదుపాయాలు ఉన్నాయి.

  • ఇందులో మీ గురించి, మీ ఆసక్తుల గురించి ఇతరులకు తెలియచేయవచ్చు.
  • మీరు సినిమా తీయాలనుకుంటుంటే మీ సినిమాలో పనిచెయ్యడానికి కావలసిన నటీనటులు/సాంకేతిక నిపుణుల గురించి ప్రకటనలు చెయ్యవచ్చు.
  • మీరు ఇది వరకే లఘు చిత్రాలు నిర్మించివుంటే వాటిని ఇక్కడ ప్రదర్శించవచ్చు.
  • సినిమా నిర్మాణం గురించి మీ దగ్గరున్న సాహిత్యాన్ని ఇతరులతో పంచుకోవచ్చు.
  • మీరు నటీనటులవ్వాలకుకుంటుంటే మీ ఫోటోలు/వీడియోలు ప్రకామ్యలో ప్రదర్శించవచ్చు.
  • అన్నిటికంటే ముఖ్యంగా మీలాగే సినిమా తియ్యాలనే ఆసక్తి ఉన్న మరికొంతమందిని ఇక్కడ కలుసుకోవచ్చు.

ఇలా ప్రకామ్య ద్వారా మీరు మీ సినిమా కలను నిజం చేసుకోవచ్చు. కేవలం వెబ్ సైట్లో కలుసుకుని సినిమా తీసేస్తారా అనే అనుమానం నాకు లేదు. అలా అని రాత్రికి రాత్రే లఘు చిత్ర నిర్మాణం మొదలయిపోతుందన్న ఆశ కూడా లేదు. గత సంవత్సరం ఇదే రోజున నవతరంగం మొదలుపెట్టినప్పుడు ఇన్ని వ్యాసాలు వస్తాయని ఊహించలేదు. అలాగే ఇంకో సంవత్సరం రోజుల్లో ప్రకామ్య ద్వారా కలుసుకున్న ఔత్సాహికులు ఇక్కడే తమ సినిమాలను ప్రదర్శించినా ఆశ్చర్యం లేదు.

చివరిగా చెప్పొచ్చేదేమిటంటే ప్రకామ్య ద్వారా ఏం చెయ్యొచ్చని అడిగితే “The possibilites are endless!” అని మాత్రం చెప్పగలను.

మరి ఇంకా ఎందుకు ఆలస్యం ప్రకామ్యలో చేరండి. మీ కల నిజం చేసుకోండి.

మీ సలహాలు, సందేహాలు prakamyam[at]gmail[dot]com కి మైల్ చెయ్యండి.