January 7, 2009 by OmSai
(6 replies)
Category: books needed
1975 లొ తెలుగు సాహిత్య అకాడమి అవార్డ్ పొందిన రచన "ఊబిలోదున్న" - రచయిత- వినుకొండ నాగరాజు గారు - ఎమెస్కో ప్రచురణ- నేను ఇండియా వెళ్ళినప్పుడు చాలా ప్రయత్నించాను.. కాని ఎవ్వరి దగ్గరా దొరకలేదు. ఎమెస్కో ను కొనుక్కున్న వాళ్ళకైతే ఈ పుస్తకం గురించి అసలు తెలియదు. పోనీ వినుకొండ నాగరాజు గారి అడ్రస్ దొరికినా చాలా సంతొషమే.
Price:
చాలా చాలా ధాంక్స్ రాజేంద్ర గారు..మీ తదుపరి పోష్ట్ గురించి ఎదురు చూస్తున్నాను
OmSai 436 days ago
మన్నించాలి ఓంసాయి గారు,ఇప్పటికే చాలా ఆలస్యంగా బదులిస్తున్నాను.వినుకొండ నాగరాజు గారు 2008 సంవత్సరం జులై నెల చివరి వారంలొ కన్నుమూసారు.22/23 అనుకుంటాను.వారి దశదినకర్మలరోజు సాక్షి దినపత్రికలో ఆయన ఫొటోతో బాటు,వారికుటుంబసభ్యులపేర్లు,ఇంటి చిరునామా అన్నీ ఒకప్రకటనలో వచ్చాయి.అది నేను సేవ్ చేసాను.మీకు చెప్పినదగ్గర్నుంచీ వెతుకుతున్నాను.కానీ పొరబాటున డిలిట్ చేసానా అని ఇన్నాళ్ళకు అనుమానమొస్తుంది.
సాక్షి దినపత్రిక archivesవిభాగంలొ ఇ-పేపర్ వెతకలేకపొయాను,నాకు చేతకాలేదు.మీరు ప్రయత్నించి చూడండి.ఈలొపు నావంతు కృషి నేను చేస్తాను.
rajendra 429 days ago
క్షమించాలి రాజేంద్రగారు..మీ మొదటి మెసేజ్ చూశాక ఏమి రాయాలో అర్దం కాలేదు. నాగరాజు గారి మరణ వార్త విని. నేను కూడా సాక్షి లో వెదికాను. కాని డిజిటల్ కాపీలు అక్టోబర్ తర్వాతే వున్నాయి. ఆర్కవ్స్ లో ఆడ్స్ఏలా వెతకాలో అర్దం కాలేదు. కానీ ఈ విషయం లో మీకు చాలా థాంక్స్. ఆయన కొడుకు ని కాంటాక్ట్ చేశాను..ఈమెయల్ ద్వారా.. ఆయన రిప్లయి గురించి ఎదురు చూస్తున్నాను.
OmSai 421 days ago
ఓం సాయి గారు, నిన్న25 న బాపు గారిని కలిసినపుడు ఈ పుస్తకం వుందా అని అడిగాను. విన్నానండి Emesco వారిది కదా అని వారి collection లో చూసారు. దొరకలేదు. నాగరాజు గారు తిరుపతి వారా అని అడిగారు. తిరుపతి వారైతే నామిని గారిని అడుగుతానన్నారు. దేని కోసం అని అడిగితే మీరు దానిపైన research చేస్తున్నారేమో అని అన్నాను.
విజయవర్ధన్ 418 days ago
అందరికి చాలా ధాంక్స్. నాగరాజు గారు సొంతంగా "ఊబిలోదున్న" పబ్లిష్ చేశారని తెలిసింది. దాని గురించి పయత్నిస్తునాను.దొరకగానే అందరికి సోర్స్ తెలియచేస్తాను. రాజేంద్రగారు, ఈ విషయం లో మీకు మరీ మరీ థాంక్స్
OmSai 417 days ago

rajendra
Profile
Friends
Friends of
Classified
Files
Pages
Photo Albums
ఒక్క రెండురోజులసమయములొ నేను నాగరాజు గారి చిరునామా ఇవ్వటానికి ప్రయత్నిస్తాను ఓంసాయి గారు
rajendra 436 days ago