తెలంగాణ సినిమాకోసం రీసెర్చ్ మెటీరియల్ - మీరు కూడా ఒక చేయ్యి వేస్తే..!!!!!

తెలంగాణ సినిమా రీసెర్చ్ కి మీ వంతు కృషి చేయండి.... !

   నవతరంగం నుంచి పిలిం తెలంగాణ 2009 పోటీలకు ఒక లఘుచిత్రాన్ని పంపుదామన్న సదుద్దేశంతో మెదలు పెట్టిన ఈ కార్యక్రమానికి నవతరంగ పాఠకుల చేయూత ఎంతయిన అవసరసరం. చరిత్ర మీద సినిమాలు తీస్తున్నప్పుడు ఆ చరిత్రపట్ల అవగాహన ఒక నిశిత పరిశీలన చేయాల్సిన అవసరం ఎంతయినా ఉంది. అలాంటి పరిశోధనాత్మక కార్యక్రమాలు ఉద్యోగరధులయిన మనలాంటి వారు ఒక్కరోక్కరుగా చేబూనటం తలకు మించిన భారమవటం చేత, నవతరంగం పాఠకుల జ్ఞానాన్ని సినిమా చేయ్యగోరుతున్న ఔత్సాహుకులతో పంచుకోమ్మని అభ్యర్దిస్తున్నాను. మీకు తెల్సిన విషయాలు కాని, మీరు చదివిన పుస్తకాలు,చూసిన వీడీయోలు, ఆర్కుట్ చర్చాహారాలు,వీడియో గూగుల్,యూట్యుబ్,వెబ్ సైట్లు,పిడియఫ్లు, బ్లాగుటపాలు కాని లేద మీరు వెలికితీసిన కొత్త కోణాలు, మనసుకు హత్తుకునే కధలు కాని, జన బాహుళ్యానికి దూరమయిన నిజాలు కాని మీకు తెలిసినవున్నాట్టయితే వాటిని వ్యాఖ్యల రూపంలో ఈ టపాలో భద్రపరచగలరు.

   మీ వంతుగా మీరు చేసిన విజ్ఞాన పంచుకోలుకు పైసలు చెల్లించకపోయిన,మీ పేర్లు తప్పని సరిగా సినిమా బృందంలో పెట్టగలమని మనవి.

 తెలంగాణ విభజన గురించి వినని ఆంధ్రప్రదేశ్ పౌరుడు ఉండడు, అలాగే ఇప్పటివరకు సమస్య మీద పూర్తిఅవగాహన ఉన్న వ్యక్తులు మన చూట్టూ తటస్తించటం కూడా తక్కూవే(శూన్యమనే చెప్పోచ్చు). కనుక మనమే తలోక చెయ్యి వేసి విషయ సంపద ఒక చోట చేరిస్తే ఈ సినిమా తీద్దాం అనుకుంటున్నవారికి ఒక విజ్ఞన ఖని అందించిన వారమవుతాము. నా వంతుగా  వ్యాసం చివరలో నాకు లభించిన లింకులు ఇస్తున్నాను.

ముఖ్యంగా చెప్పాల్సిన విషయం ఏంటి అంటే : ఇక్కడ  నవతరంగం, ప్రకామ్య నిర్వాహకులు మరియు సభ్యులు తెలంగాణ సమస్య మీద విషయ సేకరణ మాత్రమే చేస్తున్నారు, ఇక్కడ తెలంగాణ ఉద్యమం గురించి అందులో నిజనిర్దారణలు, నిర్ణయాలు,అభిప్రాయలు,పంచుకోవటం లేదు అని గ్రహించి, మీకు తెలిసిన విషయాలు మాతో/మనందరం(తో) పంచుకో గోరుచున్నాము. దయచేసి ఎటువంటి చర్చకు దారి తీయకుండా వుండటంలో మీ వంతు సహకారన్ని చేయగలరని సర్వతోముఖంగా అభ్యర్ధిస్తూ...

 

నా వంతుగా :

http://telanganastudents.blogspot.com/

http://hridayam.wordpress.com/2008/06/29/telangana-armed-struggle-clarification/
http://yategy.blogspot.com/2008/11/blog-post_05.html
http://amtaryaanam.blogspot.com/2008/03/2.html

తెలంగాణ-చరిత్ర-కొన్ని వాస్తవాలు

తెలంగాణకు సంబందించిన విషయాల (తెలంగాణ-చరిత్ర-వాస్తవాలు) గురించి తెలుసుకోవాలంటె, క్రింద ఇవ్వబడిన లింకులు చూడండి
(To know some facts and history of telangana, go thru the below given links )
 
 
 
 
 
 
 
కామెంట్ల రూపంలో మీరు పంచగోరుతున్న విషయ పార్శ్వలను ప్రచురించ గోరుతూ.... చంద్ర
Price:

మెటీరియల్ కావలెను అని రాసాను కాని ఏలాంటీది కావాలి అని రాయలేదు కనుక ... ఇక్కడ రాస్తున్నాను... పాఠకులు గమనించగలరు...

ఈ సినిమాకు కావలసిన సామాగ్రి:

౧. తెలంగాణ పల్లె పాటల సాహిత్యం (శ్రవణ మరియు దృశ్య)
      కోడిబాయే లచ్చమ్మదీ,కోడిపుంజుబాయే లచ్చమ్మది దగ్గరనుంచి, సుద్దల హనుమంతు విప్లవగీతాల దాకా ఏవమయిన గొప్ప పేరుగల్ల గీతాలు తెలుపగలరు
      తెలంగాణ ప్రాంతాలలో బాగ వినవచ్చే వాయిద్యాల పేర్లు, వాటికి సంభందించిన గొప్ప కళాకారుల పేర్లు చెప్ప్గగలిగితే ఇంకా సంతోషం
౨. తెలంగాణ సంస్కృతి గురించి (సాహిత్యం)
      నాటి జీవన విధానాలి, నిజాం కాలపు జీవన విధానాలు, స్వతంత్రభారతం మెదటిలో , ఇప్పుడు.....  వీటిగురించిన సమాచారం

౩. పాలకులు చేసిన పొరబాట్లు

౪. తెలంగాణ ,ఆంద్ర విభజనవలన కలిగే లాభ నష్టాల మీదవిడిపోతే వచ్చే పరిణామాల ఊహాత్మక వ్యాసాలు

౫. ముఖ్యంగా, తెలంగాణ పదకోశం !! బాగా వాడుకలో ఉన్న పదాలు, పోతన కాలం నుంచి ఈ కాలం వరకు భాషలో వచ్చిన మార్పుల మీద ఏమన్న కనీసం పరిచయవ్యాసాలు దొరికితే తెలుప గలరు.

౬. బౌగోళిక మార్పులు వాటి పరిణామాలు.

౭. నల్గొండ నీటి వనరులు పెంపొందించటానికి భవిష్యప్రణాళికలు - వీటి మీద సమాచారం....

మీకు తోచినవి.....

    

 

chandramouli 426 days ago

చంద్రమౌళి గారూ

ప్రస్తుత పరిస్థుతుల్లో నేను తెలంగాణా సినిమా పోటిల్లో పాల్గొంటానో లేదో తెలియదు కానీ మీరు సేకరించిన resources మాత్రం ఏదో ఒక రోజు ఎవరికో ఒకరికి పనికొస్తాయనే నమ్మకం ఉంది. కొన్ని వీడియోలు చూసాను. తెలంగాణ గురించి మనకి తెలియనిది ఎంత ఉందో అర్థమయింది. ధన్యవాదాలు. నేను కూడా చూస్తాను. ఏవైనా వ్యాసాలు, మెటీరియల్ దొరికితే తప్పక అప్ లోడ్ చేస్తాను.

వెంకట్ 425 days ago

ప్రత్యక్షంగా పాల్గొనక పోయిన పరోక్షంగా మీ సహయ సహకారాలు అందించగలరని ఆశిస్తున్నాను.
---

మరో లింకు:
www.discover-telangana.org

 

chandramouli 425 days ago

hcuలొ ఉండగా MFA వాళ్ళు తీసిన వీడియోలు చాలా చూసాను. హైదరాబాదులో ఉన్నవాళ్ళెవరైనా కొంచెం కష్టం మీద వాటిని సంపాదించుకోవచ్చు. నా దగ్గర వాటిలోని ఒక వీడియో ఉండాలి కానీ యూట్యూబ్‌లో అప్లోడ్ చేసుకొనే అనుమతి మాత్రం లేదు.

శంకర్ 425 days ago

శంకర్ గారు, MFA లో చదివిన నా స్నేహితుడు ఉండాలి అడిగి ప్రయత్నిస్తాను, మీ సమాచారానికి నెనర్లు.
-----

few more

http://hridayam.wordpress.com/2008/06/29/telangana-armed-struggle-clarification/
http://yategy.blogspot.com/2008/11/blog-post_05.html
http://amtaryaanam.blogspot.com/2008/03/2.html

 

 

chandramouli 425 days ago

you must watch this..... a folk song related for every part of andhra

http://www.youtube.com/watch?v=5xhk0efDsS8&eurl

chandramouli 425 days ago

Some original Nizam video films(35mm) are available in AP Archives Department. We have to preserve those flims into digitised format. I am trying to do that as early as possible. Any interested friends they can contact(9885171992) me on these topic.

Ramesh Panchakarla 424 days ago

@శంకర్: తెలంగాణా మీద ఫిల్మ్స్ తీసింది MFA విధ్యార్థులు కాదు. MA Communication విధ్యార్థులు. ఆ రెండు ఫిల్మ్స్ ‘తెలంగానం’, ‘బొమ్మరిల్లు’ తీసింది నీ...నా...మిత్రుడు ప్రవీణ్ బండారు. అవి యూట్యూబ్లో అప్లోడ్ చెయ్యలేరుగానీ కొన్ని రోజుల్లో కరీంనగర్ ఫిల్మ్ ఫెస్టివల్లో చూసే అవకాశం ఖచ్చితంగా ఉంది.

కత్తి మహేష్ కుమార్ 420 days ago